Monday, May 5, 2008

త్రి భాష సూత్రానికి ఎప్పుడో పిండము పెట్టారు


నాకు నవ్వొస్తున్నది త్రి భాష సూత్రము ఒకటి ఉన్నదన్న్తున్తే.....చంద్ర బాబు గారి రిటెయిలు దుకాణముల ఫలకముల మీద ఒక్క తెలుగు పేరు కూడా కనబడదు.......
మరి ఆయన తొమ్మిది సంవత్సరముల పాటు ముఖ్య మంత్రి గా పనిచేసినప్పుడు SO CALLED LABOUR డిపార్టుమెంటు
వారు నిద్రాణము లో ఉన్నారా ......

వేచి .....చూద్దాం ....తెలుగు కి తెగులు పట్టించిన దుకాణముల స్థితి ఎప్పుడు మెరుగు పడుతుందో....

5 comments:

Kathi Mahesh Kumar said...

దుకాణాల బోర్డులపై (దీన్ని తెలుగు లో ఏమంటారు?) తెలుగు "విధించడం" వలన ఒరుగు సత్వర ప్రయోజనమేమిటో? దానివల్ల తెలుగు కొరిగే వైభవమేమిటో? అర్థం కాకున్నది.

పిల్లలకు తెలుగు నేర్పించే పాఠశాలలకు ప్రోత్సాహాన్ని ఇచ్చి,తెలుగు నేర్చుకునే పిల్లలకు అవకాశాల్నివ్వాల్సిన ఈ ప్రభుత్వం, కేవలం దుకాణం బోర్డులు నల్లబరిచి తెలుగుని కాపాడుతుందట...!?! ఇది ఏమి భాషాభిమానం తిరుమలేశా?

vasantam said...

మన రాష్ట్ర దుకాణాలు,కార్యాలయాలమీద మొదట తెలుగులో వ్రాయాలనే నిభంధన వలన తెలుగుకి గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది.కనీసం ఈ ప్రారంభాన్ని కూడా చేయనీకుండా మీలాంటి వాళ్లు విమర్శించితే బాషాభిమానులు నీరసించిపోతారు.పరాయి రాష్ట్రాలవాళ్ళు,విదేశీయులు మనము మన భాషకి ఇస్తున్న గౌరవాన్ని చూసి మననికూడా గౌరవిస్తారు.అసలు మీరెప్పుడైనా తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించారా?అక్కడ అంతా తమిళమయం అయినా, వాళ్లు మన తెలుగువాల్లకంటే చక్కగా తమ మాతౄబాషని+ఇంగ్లీషుని మాట్లాడుతారు.తెలుగుకి ప్రాభవం ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వం వారి కంటే ముందు మనమంతా తెలుగులో తప్పులు లేకుండా వ్రాయగలిగినప్పుడు మరియు ప్రతిపనిని విమర్శించకుండా మన ప్రయత్నాలు (తెలుగు అభివౄద్దికి)చేయగలిగినప్పుడు.

Kathi Mahesh Kumar said...

వాసు గారు,దుకాణం బోర్డులపై తెలుగుకు నేను వ్యతిరేకం కాదు. కానీ,ఇలా మొక్కుబడి నిర్ణయాలు చేసి ప్రభుత్వం మనల్ని వెధవల్ని చేస్తున్నదని మాత్రమే నా మనవి. అవసరమైన చోట,తెలుగును కాపాడటానికి విధానపరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోవటం లేదని నా బాధ.

vasantam said...

మహేష్ గారు,నేను చెప్పేది అసలు ప్రభుత్వ సహకారం గురించి ఎదురు చూడకుండా మనవంతు ప్రయత్నాలు చేయటమే ఉత్తమం.
కమీషన్ డబ్బులు లెక్కపెట్టుకోవటంలో,పేపర్లు,ఉక్కు కర్మాగారాలు పెట్టుకోవటంలో తలమునకలుగా వున్న ప్రభుత్వం వాళ్లు, తెలుగు బాషాభివ్రుద్దికి నిర్మాణాత్మక చర్యలు చేపడతారని ఆశించటము మన అమాయకత్వం.

మీ అభిప్రాయం మీది, నేనేమి మిమ్మల్ని వ్యతిరేకించటం లేదు.నా బాధ నేను చెప్పానంతే.

అసలు ఈ బ్లాగ్ సృష్టికర్త తెలుగులో సరిగా వ్రాయలేరు (అన్నీతప్పులే ),పత్రికల బాషా దోషాల గురించి తెగ బాధపడి పోతుంటారు, అందరి తప్పులగురించి బూతద్దములో వెతుకుతుంటారు,తన తప్పుల గురించి తెలిపితే కామ్మెంట్లని తీసేస్తారు.

అందుకే నేననేది ముందు మనము సరిగ్గా తెలుగులో వ్రాయటము,మాట్లాడటము, మన తెలుగు బషాభివ్రుద్దికి మనవంతు తోడ్పాటు ఇవ్వటం,ఇతరులని ప్రోస్సహించటం(చిన్నవో, పెద్దవో ఎదోవొక చర్యలు) చేస్తే మంచిదని.

మీ స్పందనకి నా ధన్యవాదాలు.

RG said...

ఇప్పటికైనా ఇలాంటి రూల్ ఒకటి గుర్తుకొచ్చింది సంతోషం. బెంగుళూరులో షాపుల బోర్డులు చూసినప్పుడు ఏడుపొస్తుంది. అక్కడ ముందు కన్నడంలో రాసి తర్వాత ఇంగ్లీషులో రాస్తారు.Even MNC's follow this.

అదే కాకినాడ వెళ్ళినప్పుడు చూస్తే పచారీకొట్టు బోర్డుకూడా ఇంగ్లీషులోనే ఉంటుంది. పోనీ హైదరాబాదు మెట్రో, రకరకాల భాషలవాళ్ళుంటారు వాళ్ళకి అర్థంకావటానికి ఇంగ్లీషులో రాసారంటే అనుకోవచ్చు. కానీ ఆంధ్రానడిబొడ్డున ఉన్న మా ఊరికేంటి??